Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...లోకేష్ వల్లనే టీడీపీకి పవన్ దూరమయ్యాడు...టీడీపీ నేత సంచలనం !
posted on: Jul 8, 2019 1:33PM

తెలుగుదేశం పార్టీ ఓటమి పాలయ్యాక ఆ పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశం అవుతున్నాయి. తాజాగా ఈ ఓటమికి బాబు చేసిన సమీక్షలు, పార్టీలో చేరికలే కారణం అని వ్యాఖ్యానించిన ఆయన తాజాగా టీడీపీతో పవన్ కి చెడడానికి గల కారణం లోకేష్ అని చెబుతూ సంచలనం రేపారు. 2019 ఎన్నికలకు ఏడాది ముందు టిడిపికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ చేసిన తిరుగుబాటు కూడా కొంప ముంచిందన్న ఆయన దానికి గల కారణాలను విశ్లేషిస్తూ ఎపీకి కాబోయే సీఎం లోకేష్ అనేలా సంకేతాలు ఇవ్వడం వలనే పవన్ కళ్యాణ్ టీడీపీకి దూరం అయ్యారని ఆయన కామెంట్ చేశారు.
లోకేష్ సీఎం అన్న అంశం మీదనే పవన్ విబేధించి అప్పటి నుండి పవన్ కళ్యాణ్ టిడిపికి వ్యతిరేకంగా యుద్ధం చేశాడని బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. అలా మొదలయిన ఈ తిరుగుబాటు కుల సమీకరణాల మార్పుకు దారి తీసి జగన్ కి అధికారం కట్టబెట్టిందని ఆయన పేర్కొన్నారు. ఇక స్వయంగా అవినీతి కేసుల ఆరోపణలు ఎదుర్కొంటోన్న జగన్ అవినీతి వ్యతిరేకమని ప్రకటనలు చేయడం హాస్యస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. అయితే ఏపీలో బిసి కమ్యూనిటీలు టిడిపీ వెన్నంటే ఉండేవని, 35 ఏళ్ల తర్వాత పార్టీని కాదని ఈ సారి వైసీపీని ఆదరించారని పేర్కొన్నారు.






