TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మీ కాళ్లు మొక్కుతాం అని వేడుకున్నా వైసీపీ ప్రభుత్వం కనికరించలేదు

Published on: Wed Jun 24, 2020 5:33PM

ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో వైసీపీ ల్యాండ్ మాఫియా అక్రమాలు చేస్తుందంటూ టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. 

"పేదల స్థలాలు బలవంతంగా లాక్కొని తిరిగి పేదలకు అమ్మడమే 'వైఎస్ జగన్ ఇళ్ల స్థలాల అమ్మకం పథకం'. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో మీ కాళ్లు మొక్కుతాం సార్ అని వేడుకున్నా వైకాపా ప్రభుత్వం కనికరించలేదు." అని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

"దీనిపై కోర్టు ఇచ్చిన స్టే ని సైతం లెక్కచేయకుండా 1999లో టిడిపి ప్రభుత్వం 50 ఎకరాల్లో 964 మంది పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను ఇప్పుడు జగన్ రెడ్డి దౌర్జన్యంగా లాక్కోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో వైకాపా ల్యాండ్ మాఫియా చేస్తున్న అక్రమాలు అన్నీ,ఇన్నీ కావు. భూముల కొనుగోలు పేరుతో కోట్లు కొట్టేస్తున్నారు. అవే స్థలాలు పేదలకు పంపిణీ అంటూ పేదల రక్తాన్ని పీలుస్తున్నారు." అని లోకేష్ విరుచుకుపడ్డారు.