కడప ఉక్కు.. ఆంధ్రుల హక్కు
Published on: Tue Jun 26, 2018 11:20AM
.jpg)
కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం సీఎం రమేష్ చేపట్టిన దీక్ష ఏడవ రోజుకి చేరుకుంది.. ఇప్పటికే సీఎం రమేష్ దీక్షకు చాలామంది మద్దతు తెలిపారు.. తాజాగా మంత్రి నారా లోకేష్ ట్విట్టర్లో దీక్ష గురించి స్పందించారు.. 'కడప ఉక్కు, ఆంధ్రుల హక్కు.. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీ నెరవేర్చాలని, పార్లమెంట్ సభ్యుడు సిఎం రమేష్ గారు చేస్తున్న దీక్ష ఏడవ రోజుకి చేరుకుంది.. అయినా కేంద్రం నుండి ఎలాంటి స్పందన లేకపోవడం ఆంధ్రుల పట్ల బీజేపీ నేతల వైఖరిని మరోసారి బయటపెడుతుంది.. బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతియ్యడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.. రాష్ట్ర బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు చెయ్యకుండా హామీల అమలు కోసం ఢిల్లీలో యాత్రలు చేస్తే బాగుంటుంది' అని లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.. మరి ఈ విషయంపై బీజేపీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.


