TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నా తల్లిని అవ‌మానించిన ఏ ఒక్కరినీ వదలను.. నారా లోకేష్ శ‌ప‌థం..

Published on: Thu Feb 24, 2022 3:28PM

నెల‌లు గ‌డిచినా.. నారా లోకేశ్‌లో ఆ బాధ ఏమాత్రం త‌గ్గ‌లేదు.. ఆ ఆవేశం చ‌ల్ల‌బ‌డ‌లేదు. నిండు స‌భ‌లో త‌న త‌ల్లిని కించ‌ప‌రిచిన వైసీపీ మూక‌ల‌పై ర‌గిలిపోతున్నారు. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు.. వారిలో ఏ ఒక్క‌రినీ వ‌దిలిపెట్ట‌న‌ని శ‌ప‌థం చేశారు నారా లోకేశ్‌. ఆయ‌న పంతం..ప‌ట్టుద‌ల చూస్తుంటే.. జ‌గ‌న్‌రెడ్డి, కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ, అంబ‌టి రాంబాబు, ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డిల‌కు ఏనాటికైనా లోకేశ్ చేతిలో ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని అనిపిస్తోంది. లోకేశ్ ఆవేశం-ఆక్రోషం అలా ఉంది మ‌రి. 

"శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు. విజయలక్ష్మి గురించి, వైఎస్‌ భారతి గురించి, జగన్‌ కుమార్తెల గురించి మేం అలా మాట్లాడితే ఎలా ఉంటుందో వాళ్లు ఆలోచించుకోవాలి. అది మా సంస్కృతి కాదు.. ఓ తల్లి ఎలా బాధపడుతుందో కొడుకుగా చూశా. ఎవరైతే అవమానకరంగా మాట్లాడారో వాళ్లు క్షమాపణ చెప్పే వరకు నేను వాళ్లను వదిలిపెట్టనని నా తల్లికి శపథం చేస్తున్నాను" అని నారా లోకేశ్ ప్ర‌తిజ్ఞ చేశారు. 

సాక్షి పేప‌ర్‌పై తాను దాఖ‌లు చేసిన‌ ప‌రువు న‌ష్టం కేసులో కోర్టు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యేందుకు విశాఖ వ‌చ్చారు నారా లోకేశ్‌. వైఎస్ వివేకా హత్య తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుపై సాక్షిలో దుష్ప్రచారం చేశారని మండిప‌డ్డారు. "నేను రాజకీయాల్లోకి రాకముందు నుంచి ‘సాక్షి’ నాపై దాడి చేస్తోంది. వ్యక్తిగత జీవితానికి సంబంధించి నాపై బురద జల్లింది. 2019 అక్టోబరులో ‘చినబాబు చిరుతిండి 25 లక్షలండి’ అనే శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురితమైంది. దాన్ని చూసి మరో ఆంగ్ల పత్రిక, మరో నేషనల్‌ మ్యాగజైన్‌ కూడా కథనాలు ప్రచురించాయి. వాళ్ల ముగ్గురికీ నేను నోటీసులు జారీ చేశాను. అనంతరం ఆ మ్యాగజైన్‌ క్షమాపణ కోరింది. కానీ సాక్షి, మరో పత్రిక ఎక్కడా వివరణ ఇవ్వలేదు. నేను విషయంపై వివరణ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని వాళ్లు పబ్లిష్‌ చేయలేదు. అందుకే నేను సాక్షిపై పరువునష్టం దావా వేశాను. ఇది ఇక్కడితో ఆగదు. తప్పకుండా న్యాయ పోరాటం చేస్తా. నాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు.  రాజకీయాల్లో ఎదగకూడదని ఆ పత్రిక మాపై దుష్ప్రచారం చేస్తోంది. ఇలాంటి వాటికి మేం భయపడం. ఎవరైనా తప్పుడు వార్తలేస్తే తప్పనిసరిగా వాళ్లపై నేను పరువు నష్టం దావా వేస్తా. అన్ని రంగాలపై దాడి చేయడం జగన్‌ రెడ్డి ట్రేడ్‌మార్క్." అని ఫైర్ అయ్యారు నారా లోకేశ్‌.