అమ్మ, బ్రహ్మిణి సంపాదిస్తున్నారు.. నాన్న, నేను ఖర్చుపెడుతున్నాం..
Published on: Sat Apr 28, 2018 4:44PM
.jpg)
ఏపీ ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేశ్ ఈరోజు విశాఖ వద్ద అచ్యుతాపురం ప్రత్యేక ఆర్ధిక మండలిలో గల బ్రాండిక్స్ అపెరల్ సిటీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళా సాధికారితతో తమ కుటుంబం ముందుందని చెప్పిన అన్నారు. హెరిటేజ్ సంస్థను చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రహ్మిణి నడిపిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే వారిద్దరూ సంపాదిస్తుంటే నేను నాన్న రాజికీయాల కోసం వాటిని ఖర్చు చేస్తున్నాం అని అమ్మ, బ్రహ్మణి సంపాదిస్తుంటే ఆ డబ్బులను నేను నాన్న ఖర్చు పెడుతున్నామని చమత్కరించారు. ఒకే పరిశ్రమలో 18 వేలమంది పనిచేస్తున్న ప్రైవేటు పరిశ్రమ దేశంలో బ్రాండిక్స్ తప్ప మరొకటి లేదని ఆయన తెలిపారు. ఇక్కడ సౌకర్యాలను చూసి మిగిలిన రాష్ట్రాల వారు కూడా కాపీ కొడుతున్నారని.. ఇటువంటి పార్కులు మరిన్ని ఏపీలో ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో తెదేపా ప్రభుత్వం పని చేస్తోందని వెల్లడించారు.


