లోకేశ్ కాన్వాయ్ కు ప్రమాదం..

 

ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప కాన్వాయ్ ప్రమాదానికి గురై తృటిలో ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే కదా. తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. జన్మభూమి - మా ఊరు' కార్యక్రమంలో భాగంగా తన నెల్లూరు పర్యటనను ముగించుకుని, ఏపీ మంత్రి నారా లోకేష్ తిరిగి ప్రయాణిస్తుండగా..ఆయన కాన్వాయ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఏర్పేడు మండలం మేర్లపాక దగ్గర  కాన్వాయ్ లో వెనక వస్తున్న సెక్యూరిటీ వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో రెండు ఎస్కార్ట్ వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదు.