TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

హెరిటేజ్‌కు లోకేశ్ రాజీనామా...స‌భ‌లో చిన్నవాడిని..

Published on: Fri Mar 31, 2017 11:57AM


తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్సి నారా లోకేశ్ ఎమ్మేల్యో కోటాలో ఎమ్మెల్సీ పదవికి ఎన్నికైన సంగతి తెలిసిందే. నిన్న శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి ఆధ్వర్యంలో ఆయన ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన హెరిటేజ్‌కు ఈ రోజు రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. త‌న 9 ఏళ్ల హెరిటేజ్ ప్ర‌యాణంలో ఎన్నోవిజ‌యాలు సాధించాన‌ని, హెరిటేజ్ యాజ‌మాన్యం, సిబ్బంది సేవ‌లు మ‌రువ‌లేనివ‌ని ప్ర‌శంసించారు. తాను ఎమ్మెల్సీగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డం కొత్త అనుభూతినిస్తోంద‌ని, పెద్ద‌ల స‌భ‌లో చిన్న వాడినని అన్నారు. 34 ఏళ్ల‌కే మండ‌లిలో అడుగుపెట్టానని చెప్పారు. స‌భ‌లో అన్ని నేర్చుకుంటున్నానని, ప్ర‌తిప‌క్షం స‌భ‌లో నిన్న మంచి స‌ల‌హాలు ఇచ్చిందని వ్యాఖ్యానించారు. అంతేకాదు శాసనమండలిలో జరిగినట్లు శాసనసభ జరగడం లేదని.. దీనిపై ప్రతిపక్షం ఆలోచించారని సూచించారు.