ఎమ్మెల్సీ అభ్యర్థిగా లోకేష్ నామినేషన్....
Published on: Mon Mar 6, 2017 1:19PM

టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈసందర్భంగా నారా లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ... తనకు మరో జీవితం మొదలైందని, ప్రజా ప్రతినిధిగా, రాష్ట్రాభివృద్ధికి, తెలుగుదేశం పార్టీ విస్తరణకు తనవంతు కృషి చేస్తానని ఆయన రేలిపారు. అంతేకాదు తనకు మద్దతుగా నిలిచిన వారందికీ కృతజ్ఞతలని, ఈ సమయం తనకెంతో ప్రత్యేకమని చెప్పారు. ఇక ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా కూడా అభిమానులతో పంచుకున్నారు.
.jpg)


