తెలంగాణలో టీడీపీకి గట్టి క్యాడర్ వుంది.. లోకేశ్

1. హైదరాబాద్  మహానగర పాలక సంస్థ ఎన్నికలలో గతం కంటే లక్షాన్నర ఓట్లు ఎక్కువ వచ్చాయి .
ఇంటిపేరు కస్తూరి వారు -- ఇళ్ళంతా గబ్బిలాల కంపనీ - ఎన్ని లచ్ఛలొస్తే ఏట్లే సామీ - ముక్కీ మూలిగీ గెలిచిందొకటే గా...!!

2. తెరాస హామీలు అమలు చేయాలంటే 60 వేల కోట్లు కావలి. అంత సొమ్ము ఎక్కడ నుంచి తెస్తారో చూడాలి.
ఆంధ్రాలో మీ నాయనిచ్చిన హామీలకి వేల కోట్లెట్టా తెస్తన్నాడో - ఇయ్యి కూడా అట్టాగే... ఆళ్ళ సావేదో ఆళ్ళు సస్తార్లే....!!

3. తెలుగుదేశం అసలు లక్ష్యం 2019
మంత్లీ టెస్టుల్లోనే  గ్రేడులిట్టా ఏడిచాయ్ - ఇదే ప్రిపరేషన్ తో ఎలితే ... బోర్డ్ ఎక్షామ్ లో బోడిగుండే ...!!

4.తెలంగాణలో తెలుగుదేశానికి గట్టి క్యాడర్ వుంది .
పోయినోళ్ళంతా పోగా మిగిలిందే పుంజెడు మంది - ఇంతోటి మందకి కేడరంటూ పెద్ద పదాలెందుకులే సామీ .. !!

5. తెరాస కు ప్రధాన ప్రత్యర్ది తెలుగుదేశమే ....
దేంట్లో - బైకులేసుకుని రోడ్ల మీద తిరగటంలోనా...??