TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

యువనేత లోకేశ్‌కు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి ఇవ్వాలి : ఎమ్మెల్యే ధూళిపాళ్ల‌

Published on: Wed May 28, 2025 2:52PM

 

 

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత మంత్రి నారా లోకేశ్‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్‌ను నియమించాలని పొన్నూరు ఎమ్మెల్యే  ధూళిపాళ్ల‌ నరేంద్ర మహానాడులో తీర్మానించారు. ఈ విష‌య‌మై గుంటూరు జిల్లా స్థాయిలో జ‌రిగిన మినీ మహానాడులో తీర్మానం చేసిన‌ట్లు చంద్ర‌బాబుతో ఎమ్మెల్యే తెలియ‌జేశారు.

ఇక, ప్రభుత్వ విప్, టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మరో టీడీపీ సీనియ‌ర్‌ నేత ఆనం వెంకటరమణారెడ్డి కూడా ఇదే అంశాన్ని మహానాడులో అధినేత చంద్రబాబు  దృష్టికి కచ్చితంగా తీసుకెళతామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా యువశక్తితో పార్టీకి కొత్త ఊపు తీసుకురావాలన్నదే అందరి లక్ష్యమని జీవీ ఆంజనేయులు తెలిపారు. గ‌త కొంత‌కాలంగా టీడీపీలో యువనేత నారా లోకేశ్‌కు మరింత కీలకమైన బాధ్యతలు అప్పగించాలనే చర్చ జోరుగా సాగుతున్న విష‌యం తెలిసిందే. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్‌ను నియమించాలనే డిమాండ్ పార్టీ శ్రేణుల నుంచి బలంగా వినిపిస్తోంది.