శెహభాష్.. లోకేష్ బాగా పనిచేస్తున్నావు.. భుజం తట్టిన ప్రధాని..!
Published on: Sat Aug 1, 2026 4:38PM

నువ్వు చాలా బాగా పనిచేస్తున్నావు.. శెహభాష్..లోకేష్` అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భుజం తట్టారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం చేసిన అనంతరం బయలుదేరిన ప్రధానికి నారా లోకేష్ వీడ్కోలు పలికారు. ఆప్యాయంగా భుజం తట్టిన ప్రధాని.. బాగా పనిచేస్తున్నావు.
ఇదే వేగం, స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. గతంలోనూ ఏపీలో ప్రధాని మోదీ పాల్గొన్న కార్యక్రమాలు విజయవంతం చేయడం, యోగాంధ్ర రికార్డు సాధనలో కీలక పాత్ర పోషించిన లోకేష్ కృషిని అప్పట్లో ప్రధాని మెచ్చుకున్నారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం కార్యక్రమం ముగించుకుని తిరిగి వెళుతున్న ప్రధాని మోదీకి రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ప్రధాని ఆప్యాయంగా లోకేశ్‌తో మాట్లాడి, ఆయన పనితీరుపై ప్రశంసలు కురిపించారు.
Nara Lokesh, PM Narendra Modi, Andhra Pradesh, Bhogapuram Airport, IT Minister Nara Lokesh, Narendra Modi Praises Nara Lokesh


