మోదీ పుట్టినరోజు సందర్భంగా లండన్‌లో లోకేశ్ ప్రార్థనలు
Published on: Wed Sep 17, 2025 3:32PM
.webp)
ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏపీ మంత్రి నారా లోకేశ్ లండన్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. లండన్‌లోని ప్రఖ్యాత ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించి, ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆకాంక్షిస్తూ పూజలు చేశారు.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, దేశానికి ప్రధాని మోదీ నాయకత్వం మరిన్ని ఏళ్లపాటు అందాలని ఆ భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యాన్ని దేశం తప్పకుండా సాధిస్తుందన్నారు. ప్రస్తుతం తన లండన్ పర్యటనలో ఉన్న నారా లోకేశ్, ప్రధాని పుట్టినరోజున ఈ విధంగా ప్రత్యేక ప్రార్థనలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.


