TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అసెంబ్లీ ఘ‌ట‌న‌పై భువ‌నేశ్వ‌రి వార్నింగ్‌.. వైసీపీకి సిగ్గు సిగ్గు..

Published on: Mon Dec 20, 2021 1:46PM

ఆడ పిల్ల‌లంటే ఆట వ‌స్తువులు కాదు.. స్త్రీల‌ను గౌర‌వించాలి.. ఏ మ‌హిళ‌నూ అలా అవ‌మానించ‌కూడ‌దంటూ చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి ప‌రోక్షంగా వైపీసీ నాయ‌కుల‌కు చెంప‌పెట్టులాంటి హెచ్చరిక చేశారు. అసెంబ్లీలో భువ‌నేశ్వ‌రిపై అధికార పార్టీ నేత‌లు చేసిన అసంబ‌ద్ధ వ్యాఖ్య‌ల‌పై ఆమె మొద‌టిసారి స్పందించారు. చాలా హుందాగా.. ఉన్న‌తంగా.. రియాక్ట్ అయ్యారు.  

వైసీపీ నేతల విమర్శలను పట్టించుకోన‌ని.. తాను బాధ పడటం లేద‌ని నారా భువ‌నేశ్వ‌రి అన్నారు. పనిలేక మాపై విమర్శలు చేస్తున్నారు.. సమాజానికి ఉపయోగం లేని విమర్శ‌లెందుకు? ఆ వ్య‌వ‌హారాన్ని ప‌ట్టించుకోన‌వ‌స‌రం లేదు.. తాను మాత్రం ఎప్ప‌టిలానే ప్రజాసేవకే అంకితమవుతాన‌ని.. చిరున‌వ్వుతో చెప్పారు భువ‌నేశ్వ‌రి.

సీత‌లాంటి భువ‌నేశ్వ‌రిపై నిండు స‌భ‌లో అడ్డ‌గోలు ఆరోప‌ణ‌లు చేసిన వైసీపీ మూక‌లు.. ఇప్పుడు భువ‌నేశ్వ‌రి స్పంద‌న చూసి సిగ్గుప‌డాల‌ని అంటున్నారు. ఇంతటి ఉత్త‌మరాలిపైనా తాము అలా నోటికొచ్చిన‌ట్టు వాగింది అని చెంప‌లేసుకోవాల‌ని చెబుతున్నారు. త‌న‌పై అలా కారుకూత‌లు కూసినా.. ఆమె మాత్రం న‌వ్వుతూ.. త‌న‌పై చేసిన‌ విమ‌ర్శ‌ల‌ను సుతిమెత్త‌గా తీసిపారేశారు. ప్ర‌జా సేవ‌పైనే త‌న చిత్త‌శుద్ధి అని మ‌రోసారి తేల్చి చెప్పారు. భువ‌నేశ్వ‌రి మాటల్లో మెచ్యూరిటీ చూసైనా.. బూతులు మాట్లాడే వైసీపీ నేత‌లు నోటికి తాళాలు వేసుకొని.. ముక్కు నేల‌కు రాసి.. ఆమెకు బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని రాష్ట్ర ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారు.