TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రజలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్.. భువనేశ్వరి!

Published on: Mon Sep 30, 2024 7:05PM

ప్రజలకు ఎల్లప్పుడూ ఎన్టీఆర్ ట్రస్ట్ అండగా ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరం పర్యటనలో ఉన్న ఆమె చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో రాజమహేంద్రవరం ప్రజలు తమకు అండగా నిలిచారని చెప్పారు.  తన రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా భువనేశ్వరి  ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్‌తో పాటు అంబులెన్స్ సేవలను  ప్రారంభించారు.  ప్రజలకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. ఏపీ, తెలంగాణల్లో 20 లక్షల మందికి విపత్తు సాయం అందించామని అన్నారు. విజయవాడలో వరదల సమయంలో లక్ష లీటర్ల పాలు, తాగు నీరు సరఫరా చేశామని భువనేశ్వరి వెల్లడించారు.