TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఫిబ్రవరి 7న నాని పైసా

Published on: Mon Jan 27, 2014 2:35PM

 

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నాని "పైసా" ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పలు కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు. ఈ చిత్ర నిర్మాత రమేష్ పుప్పాల మాట్లాడుతూ... "మా బ్యానర్లో తెరకెక్కిన "పైసా" చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 7న అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నాం. వంశీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. వంశీ, నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందన్న నమ్మకం ఉంది. ఇప్పటికే ఆడియో మంచి హిట్టయ్యింది. సినిమా కూడా అంతకంటే ఎక్కువ విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నాం" అని అన్నారు. ఇందులో నాని సరసన కేథరిన్ తెరెసా హీరోయిన్ గా నటించింది.