ఆహా కళ్యాణం అంటున్న నాని
Published on: Wed Dec 18, 2013 3:50PM

హిందీలో విజయం సాధించిన "బ్యాండ్ బాజా బారాత్" చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ రీమేక్ లో నాని హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి "ఆహా కళ్యాణం" అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఈ చిత్రాన్ని యాశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించనుంది. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనుంది. 2014 ఫిబ్రవరి లో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. నాని నటించిన "పైసా" చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అదే విధంగా "జెండాపై కపిరాజు" చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే విడుదల చేయనున్నారు.


