మురికిగుంటలో నాని, అమలా పాల్
Published on: Sat Mar 16, 2013 10:17AM

“జెండాపై కపిరాజు” సినిమాలో... జంటగా నటిస్తోన్న నానీ, అమలాపౌల్... ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో... హీరోహీరోయిన్లు మురికిగుంటలోకి దూకే సన్నివేశం ఒకటి ఉంది. అందుకోసం దర్శకుడు నిజంగానే వారిని ఓ మురికి కాలువలోకి దిగమన్నారట. దర్శకుని మాటకు గౌరవమిస్తూ... ఇంకేమాత్రం ఆలోచించకుండా... అందులోకి దూకేశారట మన జంట. సింగిల్ టేక్ లోనే ఈ కీలకమైన షాట్ ఓకే అయిపోవడం, సన్నివేశం అనుకున్నదానికన్నా బాగా రావడంతో... యూనిట్ సభ్యుల ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. అందుకే నానీ, అమలా గట్స్, వర్క్ కమిట్మెంట్ టిన్సెల్ టౌన్ లో హాట్ టాపిక్ గా మారాయి.


