భూమా కూతురనిపించిందబ్బా..

 

అందరూ ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న నంద్యాల ఉపఎన్నిక పోలింగ్ ఈ ఉదయం ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటల నుంచి మొదలైన పోలింగ్.. సాయంత్రం ఆరు గంటల వరకూ కొనసాగుతుంది. ఇక 2,18,858 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసులు మొహరించారు.

 

ఇవన్నీ ఒకత్తైతే ఈ ఎన్నికల్లో ఒక వ్యక్తి మాత్రం సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా మారారు. అది ఎవరో కాదు భూమా నాగిరెడ్డి కూతురు భూమా నాగమౌనిక. ఫ్యాక్షన్ పడగ విప్పే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఆమె ధైర్యంగా పర్యవేక్షిస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు. అంతేకాదు ఆమె తండ్రి లేని లోటు తీరుస్తున్నారని కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజానికి...కర్నూల్ జిల్లాలో నంద్యాల, ఆళ్లగడ్డ నియోజక వర్గాలు పేరు చెబితే చాలు ఫ్యాక్షన్ పాలిటిక్స్ గుర్తుకొస్తాయి. ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు చేయాలంటే ఎంతో గుండె ధైర్యం కావాలి. అలాంటి ప్రాంతాల్లో కూడా నిర్భయంగా.. గుండె నిండా ధైర్యంతో తిరగగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది భూమానాగిరెడ్డి మాత్రమే. అక్కడి ఫ్యాక్షన్ రాజకీయాల్లో కడిగిన ముత్యంలా ఎదిగాడు భూమా నాగిరెడ్డి. ఈ ఫ్యాక్షన్ ఏరియాల్లో పర్యటించాలంటే ఎవరికైనా వణుకుపుట్టేది. కానీ భూమా నాగిరెడ్డి మాత్రం ఒంటరిగానే ఎక్కడికైనా వెళ్లేవారు. భూమా నాగిరెడ్డి మాత్రమే కాదు... ఆమె భార్య శోభా నాగిరెడ్డి కూడా అక్కడ అనేక విజయాలు అందుకున్నారు. ఇక వాళ్ల మరణానంతరం... అక్కడ పెద్దగా ఎవ్వరూ పర్యటించలేదు..అంత ధైర్యం కూడా ఎవ్వరూ చేయలేదు. కానీ భూమా మౌనిక రెడ్డి మాత్రం తల్లిదండ్రుల బాటలో నడుస్తున్నారు. ఆడపిల్ల అయినా.. బందోబస్తు ఉంటేనే ప్రాణాలతో తిరిగి వస్తామో..? లేదో..? తెలియని ప్రాంతాల్లో పర్యటిస్తూ..ప్రజలతో మమేకమవుతున్నారు. ఇక నంద్యాల ఉపఎన్నిక పోలింగ్ సమయంలో కూడా ఉదయం నుండి ఆ ప్రాంతాల్లోనే తిరుగుతూ.. ఓటర్లలో ధైర్యం నింపుతున్నారు. ఇక ఇది చూసిన భూమా నాగిరెడ్డి సన్నిహితులు ఆశ్చర్యపోవడంతో పాటు.. మౌనిక రెడ్డికి ధైర్యం ఎక్కువే అని అనుకుంటున్నారు.