నంది అవార్డుల ప్రకటన... కమల్, రజనీకి ఎన్టీఆర్ అవార్డు

 

2014, 2015, 2016 సంవత్సరానికి గాను జాతీయ సినిమా అవార్డులు ప్రకటన జరిగింది. అమ‌రావ‌తిలో  సినీన‌టుడు, ఎమ్మెల్యే బాల‌కృష్ణ  ఈ వివరాలను తెలిపారు. నంది అవార్డులతో పాటు ఎన్టీఆర్ జాతీయ సినిమా పుర‌స్కారం, బీఎన్ రెడ్డి పుర‌స్కారం, నాగిరెడ్డి-చ‌క్ర‌పాణి సినిమా పుర‌స్కారం, ర‌ఘుప‌తి వెంక‌య్య పుర‌స్కారంను జ్యూరీ ప్రకటించింది.

 2014 సినిమా అవార్డులు:

ఎన్టీఆర్ నేష‌న‌ల్ అవార్డు- క‌మ‌ల‌హాస‌న్‌
బీఎన్ రెడ్డి జాతీయ పుర‌స్కారం- ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి
నాగిరెడ్డి-చ‌క్ర‌పాణి జాతీయ సినిమా అవార్డు- న‌టుడు ఆర్‌.నారాయ‌ణ మూర్తి
ర‌ఘుప‌తి వెంక‌య్య పుర‌స్కారం- సీనియ‌ర్ న‌టుడు కృష్ణంరాజు
గేయ ర‌చ‌యిత సుద్దాల అశోక్ తేజ‌కి స్పెషల్ జ్యూరీ అవార్డు

2015 అవార్డులు:
 
ఎన్టీఆర్ నేష‌న‌ల్ అవార్డు- ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర రావు
బీఎన్ రెడ్డి జాతీయ పుర‌స్కారం- త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌
నాగిరెడ్డి-చ‌క్ర‌పాణి సినిమా అవార్డు- కీర‌వాణి
ర‌ఘుప‌తి వెంక‌య్య పుర‌స్కారం- ప‌బ్లిసిటీ డిజైన‌ర్ ఈశ్వ‌ర్‌
స్పెషల్ జ్యూరీ అవార్డు - పీసీ రెడ్డి

2016 అవార్డులు:

ఎన్టీఆర్ నేష‌న‌ల్ అవార్డు- ర‌జ‌నీకాంత్‌
బీఎన్ రెడ్డి పుర‌స్కారం- బోయ‌పాటి శ్రీనివాస్‌
నాగిరెడ్డి-చ‌క్ర‌పాణి సినిమా అవార్డు- కేఎస్ రామారావు
ర‌ఘుప‌తి వెంక‌య్య పుర‌స్కారం- చిరంజీవి
స్పెషల్ జ్యూరీ అవార్డు - ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌