2013 సంవత్సరానికి గానూ నంది అవార్డుల ప్రకటన
Published on: Wed Mar 1, 2017 3:33PM

2013 సంవత్సరానికి గానూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించింది. ఈ వివరాలను నంది అవార్డుల ఎంపిక కమిటీ ఛైర్మన్ కోడీ రామకృష్ణ విజయవాడలో వెల్లడించారు.
* ఉత్తమ చిత్రం - మిర్చి
* ఉత్తమ రెండో చిత్రం - నా బంగారు తల్లి
* ఉత్తమ మూడో చిత్రం - ఉయ్యాల జంపాల
* ఉత్తమ కుటుంబ కథా చిత్రం - సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు
* ఉత్తమ దర్శకుడు - దయా కొడవగంటి
* ఉత్తమ నటుడు - ప్రభాస్ (మిర్చి)
* ఉత్తమ నటి - అంజలి పాటిల్ (నా బంగారు తల్లి)
* ఉత్తమ విలన్ - సంపత్‌రాజ్ (మిర్చి)
* ఉత్తమ సహాయనటుడు - ప్రకాశ్ రాజ్ (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)
* మోస్ట్ పాప్యులర్ సినిమా - అత్తారింటికి దారేది
* ఉత్తమ హాస్యనటుడు - తాగుబోతు రమేష్ (వెంకటాద్రి ఎక్స్ ప్రెస్)


