Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రధాని అభ్యర్థి నీలేకని!..కొట్టిపారేసిన కాంగ్రెస్
posted on: Dec 12, 2013 1:46PM
.jpg)
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి నందన్ నీలేకని వచ్చిన వార్తలను కాంగ్రెస్ అధికార ప్రతినిధి సందీప్‌దీక్షిత్ కొట్టిపారేశారు. రాహుల్‌గాంధీకి పార్టీలో అందరూ మద్దతిస్తున్నారని, ఆయన కాకపోతే మరెవరు ప్రధాని అభ్యర్థి అవుతారని ప్రశ్నించారు.
ప్రధాని అభ్యర్థి రేసులో నీలేకని కూడా ఉన్నారంటూ ఓ వార్తాపత్రిక కథనం పేర్కొంది. అయితే, 'ఇంతకన్నా చెత్తవార్త మరొకటి ఉండదు' అని సాక్షాత్తూ ఆయనే ఖండించినట్లు కూడా పేర్కొంది. దీనిపై కేంద్రమంత్రి సల్మాన్ ఖుర్షీద్ స్పందిస్తూ "మాకు మా పార్టీ నేతలున్నారు. నీలేకని కూడా మాతో పనిచేస్తున్నారని దాటవేశారు.
జేడీయూ నాయకుడు శివానంద్ తివారీ కూడా 'ఎవరీ నిలేకని?' అని నొసలు చిట్లించారు. కాంగ్రెస్ ఆత్మహత్య చేసుకోదలచుకుంటే ఇక చెప్పేదేముంది? అన్నారు.



.jpg)


