అన్నగారికి ఘన నివాళులు

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని తెలుగుజాతి ఆయనకు ఘన నివాళులు ఆర్పించింది. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకు కుటుంబసభ్యులు నివాళుర్పించారు. ఈ సందర్భంగా ఆయన మనవడు, సినీనటుడు ఎన్టీఆర్ మాట్లాడుతూ తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని..తెలుగుజాతికి ఆయన ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయన్నారు.