TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హరికృష్ణ పాడె మోసిన సీఎం

Published on: Thu Aug 30, 2018 2:33PM

 

నందమూరి హరికృష్ణ అంతిమయాత్ర ప్రారంభమైంది.. మెహదీపట్నంలోని ఆయన నివాసం నుండి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర జరగనుంది.. మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి.. అంతిమయాత్రలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.. హరికృష్ణ పార్థివదేహాన్ని ఇంటినుండి అంతిమ యాత్ర రథం వరకు చంద్రబాబు మోశారు.. చంద్రబాబుతో పాటు సుప్రీం కోర్టు మాజీ జడ్జి జాస్తి చలమేశ్వర్ కూడా మోశారు.. మరోవైపు ప్రముఖులతో పాటు వేలల్లో అభిమానులు కూడా అక్కడికి చేరుకొని, అంతిమయాత్ర రథం వెంట నడుస్తున్నారు.