TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కొడాలి అంటే బాలయ్యకు హడలా?

Published on: Fri Jul 20, 2012 8:44AM

తన తండ్రి ప్రాతినిథ్యం వహించిన రాయలసీమలోని హిందూపురం నుంచే పోటీ చేయాలని యువరత్న నందమూరి బాలకృష్ణ కోరుకుంటున్నారు. ఇటీవల గుడివాడ ఎమ్మెల్యే కొడాలినానిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. అందువల్ల గుడివాడ స్థానం నుంచి పోటీ చేయించాలని టిడిపి అథినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో నాయకులు ఆశిస్తున్నారు. వాస్తవానికి గుడివాడ ఎన్టీఆర్‌ స్వస్థలం. అందువల్ల బాలయ్య అక్కడ కనుక పోటీకి నిలబడితే కొడాలినానికి గట్టిపోటీ ఇవ్వగలరని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది.

 

 

అయితే బాలయ్య మాత్రం హిందూపురం నుంచి పోటీ చేస్తే రాయలసీమలో తనకున్న ఆదరణ వల్ల విజయం సాధించటం సులభమవుతుంది. కులమతాలకు అతీతంగా గెలుపొందవచ్చని ఆయన నమ్ముతున్నారు. గుడివాడ నుంచి పోటీచేస్తే మాత్రం ఒకసామాజికవర్గ నాయకుడనే ముద్ర పడుతుందని భావిస్తున్నారట. హిందూపురంలో అయితే తేలికగా విజయం సాధించవచ్చని అదే గుడివాడలో అయితే గట్టిపోటీని ఎదుర్కోవాల్సి వస్తుందని బాలయ్య భయపడుతున్నట్లు తెలుస్తోంది. హిందూపురం నుంచే పోటీచేయాలని బాలయ్య డిసైడ్‌ అయితే గుడివాడలో జరగబోయే ఉప ఎన్నికల్లో నానితో పోటీ పడే నాయకుడెవరని తెలుగుదేశం ఆలోచనలో పడిందట. అందుకే బాలయ్యను ముందుగానే గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు వొప్పించాలని బాబుకు పలువురు సూచిస్తున్నారట. అయితే బాబు సమయం వచ్చినప్పుడు మాట్లాడొచ్చని భావిస్తున్నారట.