TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఎమ్మెల్యే బాలకృష్ణ గన్‌మెన్ కుమారుడి ఆత్మహత్య

Published on: Tue Mar 14, 2017 10:23AM

ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గన్‌మెన్ మోహన్ కృష్ణ నాయక్ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరుపతిలోని కాలూరులో ఉన్న నారాయణ విద్యాసంస్థలో 10వ తరగతి చదువుతున్న సాయచరణ్ హాస్టల్ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. టీచర్ మందలించడం వల్లే సాయి ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం స్విమ్స్‌కు తరలించారు.