సీఎం జగన్‌కు నాంపల్లి కోర్టు సమన్లు.. సోమవారం హాజరు కావాలని ఆదేశం
Published on: Thu Mar 24, 2022 12:48PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నాంపల్లి కోర్టు షాకిచ్చింది. ఓ కేసు విషయమై సోమవారం కోర్టుకు హాజరుకావాలని సీఎం జగన్‌కు సమన్లు జారీ చేసింది. నాంపల్లి కోర్టు సమన్లు అనగానే.. వైసీపీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ అంశంపై స్పందించేందుకు నిరాకరించారు.
నాంపల్లి కోర్టు అనగానే.. అక్రమాస్తులు, సీబీఐ, ఈడీ కేసులు అనుకునేరు. అవి కాదు. ఇది వేరే కేసు. 2014 హుజూర్‌నగర్ ఎన్నికల్లో ఎలక్షన్ కోడ్ ఉల్లఘించారని జగన్‌పై గతంలో కేసు నమోదయ్యింది. ఆ కేసు విచారణలో భాగంగా తాజాగా నాంపల్లి కోర్టు సమన్లు ఇష్యూ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై.. జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలపైన కూడా కేసులు నమోదయ్యాయి. ఆ కేసు విచారణలో భాగంగా నాంపల్లి కోర్టుకు విజయమ్మ, షర్మిలలు పలుమార్లు హాజరు అయ్యారు. లేటెస్ట్‌గా సీఎం జగన్‌కు సమన్లు జారీ చేసింది నాంపల్లి కోర్టు.


