TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నకిరేకల్ లో కత్తులు దూస్తున్న కాంగ్రెస్ నేతలు

Published on: Fri Feb 24, 2012 1:25PM

నల్గొండ: నల్గొండ జిల్లా నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కాంగ్రెస్ నాయకులు ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు. కమ్యూనిస్టులకు ఒకప్పుడు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన చిరుమర్తి లింగయ్య 12వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నియోజకవర్గంలో మండలి డిప్యూటి చైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రాభల్యం అధికంగా ఉండగా చిరుమర్తి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఆ ప్రాభల్యానికి గండికోడుతుండడంతో ఇద్దరి మధ్య అంతర్గత విభేదాలు పొడచూపాయి. ప్రస్తుతం వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. నకిరేకల్, కేతేపల్లి, కట్టంగూర్ మండలాల్లో తన అనుమతి లేకుండా ఏ కార్యక్రమం చేపట్టరాదని ఎమ్మెల్యే చిరుమర్తిని నేతి విద్యాసాగర్ హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో వీరి మధ్య విభేదాలు మరింత పెరిగాయి. నేతిపై చిరుమర్తి బహిరంగంగానే వ్యాఖ్యలు చేయడం, నకిరేకల్ లో ఎమ్మెల్సీ వర్గీయులు ఎమ్మెల్యేను అడ్డుకోవడం, ఘర్షణ చోటుచేసుకోవడం, దిష్టిబొమ్మ దహనం చేయడంతో విభేదాలు తారాస్థాయికి చేరాయి. నేతికి కేంద్ర మంత్రి జయపాల్రెడ్డి, ఉప్పునూతల పురుషోత్తమరెడ్డితో మంచి పరిచయాలు ఉండగా, చిరుమర్తికి మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపి రాజగోపాల్ రెడ్డి అండ ఉండటంతో నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు ఎవరికీ వారు ప్రయత్నాలు చేస్తున్నారు.