లీవు పెట్టండి.. ఛలో నాగార్జునసాగర్!
Published on: Thu Aug 8, 2024 2:56PM
బోర్‌గా వుందా? ఏదైనా కొత్త టూరిస్ట్ స్పాట్‌కి వెళ్ళి అలా అలా తిరిగి రావాలని వుందా? ఆ టూరిస్ట్ స్పాట్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా వుండాలని అనుకుంటున్నారా? అయితే రెడీ అవ్వండి.. ఛలో నాగార్జున సాగర్ అని నినాదం చేయండి.. వెంటనే బయల్దేరి నాగార్జున సాగర్‌కి వెళ్ళండి. అక్కడ మీకు కనువిందు జరుగుతుంది. మనసుకీ హాయిగా అనిపిస్తుంది. ఎందుకంటే, నాగార్జున సాగర్‌కి వున్న 26 గేట్లనూ ఎత్తేశారు. పైనుంచి వరదనీరు భారీగా వస్తూ వుండటంతో అన్ని గేట్లనూ ఎత్తేశారు. నాగార్జున సాగర్ అన్ని గేట్ల నుంచి నీరు రయ్యిమని కిందకి దూకుతూ వుంటే, చూడ్డానికి రెండు కళ్ళు కాదు.. 26 కళ్ళు వున్నా సరిపోవు. ఆ అనుభూతే వేరు.. ఆ అనుభూతి మీరు కూడా పొందాలని అనుకుంటున్నారా? అయితే ఛలో నాగార్జునసాగర్!


