Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కొండా సురేఖకు నాగార్జున లీగల్ నోటీసులు?
posted on: Oct 3, 2024 3:54PM
మంత్రి కొండాసురేఖకు సినీ హీరో నాగార్జున లీగల్ నోటీసులు పంపనున్నట్టు తెలుస్తోంది. కెటీఆర్ వర్సెస్ కొండాసుురేఖ వివాదంలో హీరో నాగార్జున కుటుంబాన్ని తెరమీదకు తేవడం పట్ల సినీ , రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సమంత పేరును ఈ వివాదంలో లాగినప్పటికీ ఆ తర్వాత కొండా సురేఖ సమంతకు క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ సినీ ఇండస్ట్రీ నుంచి చిరంజీవి మొదలు ప్రతీ ఒక్కరూ నాగార్జున కుటుంబానికి బాసటగా నిలిచారు. నాగార్జున ప్రస్తుతం హైదరాబాద్ లో లేనప్పటికీ ట్విట్టర్ వేదికగా ఖండించారు. సినీ ఇండస్ట్రీ హైదరాబాద్ రావడానికి ప్రధాన కారణమైన అక్కినేని ప్రతిష్టను దిగ జార్చిన కొండసురేఖపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి నాగార్జున సిద్దమయ్యారు. ఆమెకు లీగల్ నోటీసులు పంపనున్నట్లు తెలుస్తోంది.






