కేసీఆర్తో దోస్తీ కోసమే : మోత్కుపల్లి
Published on: Sun Jan 29, 2012 8:50AM
హైదరాబాద్: నాగం జనార్దన్ రెడ్డిపై టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నాగం ఒక వీధి రౌడీ మాదిరిలా ప్రవర్తిస్తున్నారని నర్సింహులు విమర్శించారు. టీడీపీలో పదవులు అనుభవించినంత కాలం నాగం తెలంగాణా వాదాన్ని పక్కనబెట్టి, కేసీఆర్తో దోస్తీ చేసేందుకే టీడీపీని వదిలేశాడని నర్సింహులు విమర్శించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలపై నాగం అనుచరులు దాడిచేశారని, ఇప్పటికైనా నాగం తన పద్దతి మార్చుకోవాలని నర్సింహులు హెచ్చరించారు.


