జూన్ 1 నుంచి నాగబాబు ఉత్తరాంధ్ర టూర్
Published on: Mon May 30, 2022 4:44PM
నటుడు నాగబాబు జూన్ 1 నుంచి ఉత్తరాంధ్ర పర్యటన చేపట్టనున్నారు. జనసేన పార్టీ విధానాలు, పవన్ కల్యాణ్ ఆలోచనలను ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేసే లక్ష్యంతో ఆయనీ పర్యటన చేపడుతున్నారు. ఏపీలో ఎన్నికల హీట్ పెరిగిన నేపథ్యంలో ప్రజలలో మరింత మమేకమయ్యే విధంగా జనసేన ప్రణాళికలు రూపొందించుకుంటోంది.
అందులో భాగంగగానే నాగబాబు ఉత్తరాంధ్రపర్యటన అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బాదుడే బాదుకు, మహానాడు కార్యక్రమాల ద్వారా తెలుగుదేశం పార్టీ ఎన్నికల సన్నద్ధతను ఘనంగా చాటింది. అదే విధంగా గడప గడపకూ, సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర ద్వారా వైసీపీ కూడా జనం బాట పట్టింది.
దీంతో జనసేన కూడా ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాలకు నాగబాబు ఉత్తరాంధ్ర పర్యటనతో శ్రీకారం చుట్టనుంది. జూన్ 1న శ్రీకాకుళంలో నాగబా బు పర్యటిస్తారు, ఆ తరువాత 2 న విజయనగరం, 3న విశాక జిల్లాలలో పర్యటించనున్నారు.
నాగబాబు పర్యటనతో ఉత్తరాంధ్రలో జనసేన కార్యక్రమాలు జోరందుకుంటాయని చెబుతున్నారు. ఉత్తరాంధ్రప్రర్యటన అనంతరం నాగబాబు రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల పర్యటనకు షెడ్యూల్ ప్రకటిస్తారని జనసేన వర్గాలు తెలిపాయి.


