కత్తి మహేష్ పై నాగబాబు, జానారెడ్డి ఆగ్రహం
Published on: Wed Jul 4, 2018 5:21PM

ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న కత్తి మహేష్, శ్రీ రాముడి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ కొందరు పోలీసులకి ఫిర్యాదు చేసారు.. ఇప్పటికే పోలీసులు కత్తి మహేష్ కి నోటీసులిచ్చి విచారణ జరిపారు.. అయితే మహేష్ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. తాజాగా ఈ విషయంపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు.. క్రిస్టియన్లకు బైబిల్, ముస్లింలకు ఖురాన్ ఎలాగో హిందువులకు రామాయణం అలా అన్నారు.. అలాంటి రామాయణం మీద తప్పుడు వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకోవాలి.. ఇలాంటి వారిమీద తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి, లేదంటే ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు..
అలానే మతపరమైన చర్చా కార్యక్రమాలు పెట్టొద్దని మీడియాని కోరారు.. ఈ వివాదంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కూడా స్పందించారు.. కత్తి మహేశ్ లాంటి వారి వ్యాఖ్యలు వర్గాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయన్నారు.. సమాజంలో ఆందోళనలు కలిగించే విధంగా మాట్లాడటం క్షమించరానిదని అన్నారు.. ఇలాంటి విషయాల్లో మీడియా ప్రతినిధులు సంయమనం పాటించాలని, అసహ్యమైన మాటలు ప్రచురించకూడదని సూచించారు.. అలాంటప్పుడే రాజకీయ నాయకులు ఇది సరికాదని తెలుసుకుంటారని చెప్పారు.. సంస్కార హీనంగా ఎవరు మాట్లాడినా తప్పేనని జానారెడ్డి స్పష్టం చేశారు.


