గాంధీ గారు బ్రతికున్నా ఇదే చెప్పేవారు.. నాగబాబు సెన్సేషనల్ ట్వీట్

జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు చేస్తోన్న ట్వీట్స్ వైరల్ గా మారుతున్నాయి. ఇటీవల, మ‌హాత్మాగాంధీని కాల్చి చంపిన నాధూరాం గాడ్సేని నిజమైన దేశభక్తుడని ప్రశంసిస్తూ ట్వీట్ చేసి నాగబాబు విమ‌ర్శ‌లపాలైన సంగతి తెలిసిందే. అయినా నాగబాబు ఏమాత్రం తగ్గట్లేదు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని ట్విట్టర్ వేదికగా చెప్తూనే ఉన్నారు. తాజాగా, మ‌రోసారి నాగబాబాబు మ‌హాత్మాగాంధీపై ట్వీట్ చేశారు. 

ఇండియన్ కరెన్సీ నోట్లు అనగానే మనకి గాంధీనే గుర్తొకొస్తారు. నోట్లపై ఆయన బొమ్మే ఉంటుంది. అయితే నాగబాబు మాత్రం.. మిగతా మహానుభావుల చిత్రాలను కూడా కరెన్సీ నోట్లపై చూడాలని ఉంది అంటున్నారు. అంతేకాదు, ఒకవేళ గాంధీ బ్రతికున్న ఇలాగే చెప్పేవారు అంటున్నారు.

"ఇండియన్ కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్ర బోస్,అంబేద్కర్, భగత్ సింగ్,చంద్ర శేఖర్ ఆజాద్,లాల్ బహదూర్ ,పీవీ నరసింహారావు,అబ్దుల్ కలాం,సావర్కార్,వాజపేయ లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది.ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనము మర్చిపోకూడదని ఒక ఆశ.

గాంధీ గారు బ్రతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసిన దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారు. దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తు రావడం లేదు. భావితరాలకు కరెన్సీ నోట్ల పై వారి ముఖ పరిచయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది." అని నాగబాబు ట్వీట్ చేశారు.