తాతను వాడుకుంటున్న మనవడు...!
Published on: Fri Dec 6, 2013 9:08AM

అక్కినేని హిట్ సాంగ్స్ లో ఒకటైన "ఒక లైలా కోసం..." పాట ఇప్పటికి అలరిస్తూనే ఉంది. అలాంటి ఈ పాటనే నాగచైతన్య తన కొత్త సినిమాకు పెట్టుకోనున్నాడు. విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో నాగచైతన్య నటించబోయే చిత్రానికి ఈ టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలిసింది. మిస్ ఇండియా పూజా హెగ్డే హీరోయిన్ గా తెలుగుతెరకు పరిచయం కానుంది. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందనున్నఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించనుంది. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.


