TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మై హోమ్ భూజాలో వినాయకుడి లడ్డు పేరిట భారీ మోసం..!

Published on: Fri Aug 7, 2026 4:15PM

 

లడ్డూ వేలంతో పరిచయాలు.. పెట్టుబడుల పేరుతో వల..!

ఓ ఇద్దరు కేటుగాళ్లు ఖరీదైన అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటూ వినాయకుడి లడ్డూ వేలంలో ఏకంగా రూ.51 లక్షలు వెచ్చించి అందరి దృష్టిని ఆకర్షించారు. అదే పరిచయాన్ని పెట్టుబడుల వలగా మార్చుకుని కోట్ల రూపాయలు వసూలు చేసి... అందర్నీ బురిడీ కొట్టించి పరారైన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపుతోంది. మైహోం భూజాలో నివసించే కొండపల్లి గణేష్, కిరణ్ అనే ఇద్దరు వ్యక్తులు వినాయక చవితి సందర్భంగా జరిగిన లడ్డూ వేలంలో రూ.51 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. భారీ మొత్తానికి లడ్డూను కొనడంతో అపార్ట్‌మెంట్‌లోని నివాసితుల్లో వారికి ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. 

ఈ ఇద్దరు కేటుగాళ్లును సంపన్నులుగా భావించిన పలువురితో వారు సన్నిహితంగా పరిచయాలు పెంచుకున్నారు.కొంతకాలం తర్వాత తమకు రియల్ ఎస్టేట్‌తో పాటు ఇతర వ్యాపారాలు ఉన్నాయని, వాటిలో పెట్టుబడులు పెడితే నెలకు ఆరు శాతం వరకు లాభాలు ఇస్తామని నమ్మబలికారు. వారి మాటలు నమ్మిన ఓ దంపతులు 31 లక్షలు పెట్టుబడిగా ఇచ్చారు. డబ్బులు తీసుకున్న తర్వాత గణేష్, కిరణ్ స్పందించకుండా తప్పించుకోవడం ప్రారంభించారు. లాభాల సంగతి అడిగినా, అసలు పెట్టుబడి తిరిగి ఇవ్వాలని కోరినా ఏదో ఒక కారణంతో కాలయాపన చేసేవారు.

ఇదే సమయంలో అపార్ట్‌మెంట్‌లోని మరికొందరి వద్ద కూడా భారీ మొత్తాల్లో డబ్బులు తీసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. చివరకు ఇద్దరూ మైహోం భూజా నుంచి అపార్ట్‌మెంట్ ఖాళీ చేసి వెళ్లిపోవడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. .గణేష్, కిరణ్ ఆచూకీ తెలియకపోవడం, ఫోన్లు స్విచ్ఛాఫ్ రావడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారు వెళ్లిపోయిన తర్వాత ఒక్కొక్కరుగా బాధితులు బయటకు రావడం ప్రారంభించారు. ఇప్పటివరకు బాధితులు వెల్లడించిన వివరాల ప్రకారం దాదాపు రూ.4 కోట్ల వరకు వసూలు చేసి.. పారిపోయినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు రిటైర్డ్ ఉద్యోగులు తమ జీవితకాల పొదుపులను కూడా పెట్టుబడుల పేరుతో ఇచ్చినట్లు సమాచారం...ఈ వ్యవహారంపై ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంత మొత్తంలో డబ్బులు వసూలు చేశారు, ఈ వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.


My home Bhuja, Ganesha Laddu, Kondapalli Ganesh, Kiran, Real estate, Hyderabad, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand