TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మామగారు వ్యాపారం కంటే రాజకీయకెరీర్ చూసుకోమన్నారు..సునాక్

Published on: Fri Oct 28, 2022 3:19PM

తనను  బ్రిటన్  రాజకీయాల్లోకి  వెళ్లమని ఉత్సాహపరిచింది తన మామ ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి అని బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ అన్నారు. రాజకీయాల్లో ఉన్నతమైన ప్రధాని పదవికి చేరుకోవ డం లక్ష్యంగా పెట్టుకోవాల న్నారని రిషీ అన్నారు. వ్యాపారం లో  ఉండే  కంటే రాజకీయాల్లో ఉంటేనే ప్రభావం చూపగల్గుతావని నారాయణమూర్తి ఎంతో ఉత్సాహపరిచారని రిషీ అన్నారు. 

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులయిన నారాయణమూర్తి ప్రస్తుతం విశ్రాంతి జీవితం గడుపుతున్నారు. రిషీ సునాక్ గతంలో గోల్డున్ సాఛ్ సంస్థలో పనిచేశారు. స్టాన్ఫోర్డ్ నుంచి ఎంబిఏ పొందిన తర్వాత రాజకీయా ల్లోకి వచ్చి పార్లమెంటు సభ్యు నిగా ఎదిగారు. మంచి జీతంతో ఉన్నత స్థాయి కెరీర్ ను కాదని  ఆయన  రాజకీయా్ల్లోకి వచ్చారు. రిషీ బ్రిటన్ ప్రధాని పదవిని దీపావళి రోజు అధికారం చేపట్టారు. బ్రిటన్ ప్రధాని పదవిని చేపట్టిన తొలి భారత్  మూలాలున్న, తొలి హిందువుగా గుర్తింపు పొందారు. 

భారత దేశంలో అత్యంత పెద్ద సంస్థను నిర్మించి, కోట్లాదిమందికి ఉద్యోగ భద్రతను ఇస్తూ, వ్యాపార పరంగానూ ఎంతో విజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు గడించిన మా మామగారు వ్యాపారం కాదు రాజకీయాల్లో ఉంటేనే ఎంతో ప్రభావం చూపగలవన్న సూచన రావడం తనను ఎంతో ఆశ్చర్య పరిచిందని రిషీ అన్నారు.  ఆయన నా వెన్నంటే ఉండి ఎంతో ఉత్సాహపరిచారన్నారు.