TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మై డాడ్ ఈజ్ గ్రేట్‌!

Published on: Mon Sep 26, 2022 11:28AM

పిల్ల‌ల పెంప‌కం అనేస‌రికి త‌ల్లి పాత్రే కీల‌కం అంటూంటారు. తండ్రి గ‌మ‌నిస్తుంటాడ‌న్న‌ది  అంద‌రి అభి ప్రాయం. కానీ తండ్రీ ఆ పిల్ల‌డికి త‌ల్లితో స‌మానంగా అంతే ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తాడు. కానీ అది అంత‌గా ప్ర‌చారం కాదు. కావ‌డం తండ్రికీ పెద్ద‌గా ఇష్టం ఉండ‌దు. ఇది దాదాపు అంద‌రికీ అనుభ‌వైక‌మే. పిల్ల‌లు న‌డ‌క నేర్చేవ‌ర‌కూ త‌ల్లి లానే పిల్లడిని ఆడించ‌డానికి తండ్రీ అంతే స్థాయిలో అన్ని స‌దుపా యాల ఏర్పా ట్ల‌లో  ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌లూ తీసుకుంటాడు. 

పిల్ల‌డు జీవితంలో పైకి ఎద‌గాల‌ని తండ్రి ఎన్నో ఆశ‌లు పెట్టుకుంటాడు. అందుకు త‌గిన స‌హాయ స‌హ కారాలు చివ‌రంటా అందిస్తూనే ఉంటాడు. ఎవ‌రికి ఇష్టం ఉన్నా లేకున్నా. కానీ త‌ల్లి సేవ‌కే అధిక ప్రాధా న్యత‌, అత్య‌ధిక ప్ర‌చారం ల‌భిస్తుంటాయి. అదే చిత్రం! 

ఓ తండ్రి పిల్ల‌డిని ఆడించ‌డానికి,  వాడికి బువ్వ తినిపిస్తూ ఆడిపించేందుకు కొత్త ఆట‌ను క‌నుగొన్నాడు. ప్లే హౌస్ త‌యారుచేశాడు. పిల్ల‌ల్ని ఆడించ‌డానికి ప్లేస్కూల్లో ప‌డేయ‌డం కాకుండా ఇలాంటి ఆలోచ‌న చేయ‌డం త‌ల్లిదండ్రుల ప్రేమ‌ను పంచ‌డ‌మే అవుతుంది. ఇంట్లో ఆట‌బొమ్మ‌ల‌తో ఆడించ‌డ‌మే కాకుండా ఇలా కొత్త‌గానూ ఆట‌పాటల్లో వారితో ఆనందం పంచుకోవ‌చ్చు. 

అన్న‌ట్టు పైకి కింద‌కీ ఆడించ‌డానికి ఎలివేట‌ర్ కూడా ఏర్పాటు చేశాడు. పిల్ల‌డిని అందులో నిల‌బెట్టి లేదా కూర్చోబెట్టి ఎలివేట‌ర్ తాడు ప‌ట్టుకుని మెల్ల‌గా లాగుతూంటే ఉయ్యాల్లాంటి తొట్టి పైకి లేదా కింద‌కీ దిగు తూంటుంది. పిల్ల‌డికి మ‌హా మ‌జా, గొప్ప స‌ర‌దా! కానీ ఇది బాగా అల‌వాటు చేసినా ఇబ్బందే.. పిల్ల‌లు గ‌దా.. అక్క‌డే తినిపించ‌మ‌ని, ఆడించ‌మ‌నీ మారాం చేసినా చేయొచ్చు. మ‌రి మీ ఓపిక‌!

కాస్త పెద్ద‌యితే ఈ ప్ర‌యోగం ఎలా చేస్తున్న‌దీ తండ్రి చెప్ప‌డంలో ఏకంగా పిల్లాడికి ఫిజిక్స్ నేర్పేస్తాడేమో అంటూ కొంద‌రు నెటిజ‌న్లు ఇప్ప‌టికే ఉత్సాహంగా కామెంట్లు పెట్టేశారు! ఏమో అదీ జ‌ర‌గ‌వ‌చ్చు.. ఇలాంటి  ప్రేమ‌గ‌ల తండ్రి ఉంటే!.. అంటూ ఒక మ‌హిళ కామెంట్ పెట్టింది! 

పిల్ల‌డు ఆడుతూ, దాని మీద చేత్తో కొడుతూ ఆనందిస్తున్నాడు.. మా డాడ్ ఈజ్ గ్రేట్ అనేమో!