TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

‘నా ఇటుక - నా అమరావతి’ గిన్నిస్ రికార్డ్

Published on: Tue Nov 10, 2015 7:00PM

 

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు అయ్యేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ‘నా ఇటుక - నా అమరావతి’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఆన్‌లైన్లో ఇ-ఇటుకలను విక్రయిస్తోంది. తాజాగా ఈ ఇ-ఇటుకల విక్రయం గిన్నిస్ రికార్డును అధిగమించింది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం ఆరున్నర వరకు ఒక లక్షా ఐదువేల ఎనిమిది వందల మూడు మంది (1,05,803) ఇ-ఇటుకలను కొనుగోలు చేశారు. దీంతో ఇప్పటి వరకు చైనా పేరిట వున్న రికార్డును ‘నా ఇటుక - నా అమరావతి’ కార్యక్రమం అధిగమించింది.