ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌కు నేత‌ల ప‌రామ‌ర్శలు

 

గ‌త ప‌ది రోజులుగా అల్లర్లతో అట్టుడికిన ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌లో ఇప్పుడిప్పుడే కాస్త సాదార‌ణ ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. దీంతో ఆదివారం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్‌యాద‌వ్ ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌లో ప‌ర్యటించ‌నున్నారు. ఈ అల్లర్లలో గాయ‌పడి వివిధ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న వేలాది మంది క్షత‌గాత్రుల‌ను ఆయ‌న ప‌రామ‌ర్షించ‌నున్నారు.

త‌రువాత అక్కడి జిల్లా యంత్రాంగంతో పాటు శాంతి భ‌ద్రత‌లపై పోలీసు ఉన్నతాధికారుల‌తో చర్చించ‌నున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని ప్రాంతాల్లో అల్లర్లు అదుపు రావ‌డంతో చెదురు మ‌దురు సంఘ‌ట‌న‌లు కూడా జ‌ర‌గ‌కుండా చూసుకోవాల్సిందిగా పోలీస్ శాఖ‌ను ఆదేశించారు.

అలాగే ముజఫర్నగర్లో సోమవారం ప్రదాని మన్మోహన్ సింగ్, యుపిఎ అధ్యక్షురాలు సోనియా గాంధి పర్యటించనున్నారు. హిందుతుల్లోని జాట్ తెగ‌కు ముస్లిం నాయ‌కుల‌కు జ‌రిగిన చిన్న గొడ‌వ ముదిరి 48 మంది ప్రాణాలు కోల్పోయే అంత పెద్ద గొడ‌వ‌గా మారింది. దీంతొ భవిష్యత్తులో ఇలాంటి ఘ‌ర్షణ‌లు చోటు చేసుకోకుండా క‌ట్టుదిట్ట మైన చ‌ర్యల తీసుకోవ‌డానికి రెడీ అవుతుంది అఖిలేష్ ప్రభుత్వం.