భూ కబ్జా కేసులో సంగీత దర్శకుడు మణిశర్మ
Published on: Fri Mar 8, 2013 9:36AM

ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ కేసుల్లో ఇరుక్కున్నాడు. ఆయనను ఏ క్షణమైన తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకోవచ్చునని వార్తలు వినిపిస్తున్నాయి. నకిలీ భూమి పత్రాలు సృష్టించి వేరే వ్యక్తి భూమిని కబ్జా చేశారనే ఆరోపణలపై మణిశర్మపై కేసు నమోదైంది. తమిళనాడులోని కణాతూర్ దగ్గర కరూర్ కరుప్పన్ అనే వ్యక్తికి 75 సెంట్ల భూమి ఉంది. దాని విలువ దాదాపు పది కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అంచనా.
అసలు హక్కుదారుడైన కరుప్పన్ కు ఇటీవల తన భూమిమీద మణిశర్మ హక్కుదారుడుగా ఉన్నట్లు తెలిసింది. దీంతో వెంటనే తన వద్ద ఉన్న హక్కు పత్రాలతో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ప్రాథమిక విచారణ చేసిన పోలీసులు కరుప్పన్ పత్రాలు నిజమైనవేనని తేల్చారు. మరి మణిశర్మ వద్ద కాగితాలు ఎలా వచ్చాయి..అవి ఖచ్చితంగా నకిలీవేనని భావిస్తున్నారు. ఆయన ఫోర్జరీ పత్రాలు సృష్టించి ఉంటారని అంచనాకు వచ్చారు. ఈ మేరకు మణిశర్మ మేనేజరు రఘురామన్ ను పిలిపించి ప్రశ్నించారు. మణిశర్మ కోసం వెతుకుతున్నారు.


