మూసీ కూల్చివేతలు షురూ
Published on: Tue Oct 1, 2024 2:48PM

మూసీ ప్రక్షాళనలో భాగంగా నదీపరీవాహక ప్రాంతంలోని ఇళ్లను మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కూల్చివేతలు మొదలయ్యాయి. మూసీ పరివాహక ప్రాంతంలోని శంకర్ నగర్ లో అధికారులు మంగళవారం(అక్టోబర్ 1) ఉదయం కూల్చివేతలు చేపట్టారు. అయితే ఈ కూల్చివేతలు స్వచ్ఛందంగా తమ నివాసాలను ఖాళీ చేసిన వారివే కావడం గమనార్హం.
ఈ ప్రాంతంలోకి బుల్ డోజర్లు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో కూల్చివేతలను కూలీల ద్వారా చేయిస్తున్నారు అధికారులు. ఈ నివాసాల నిర్వాసితులను ఇప్పటికే చంచల్ గూడ డబుల్ బెడ్‌రూం ఇళ్ల సముదాయానికి తరలించారు. మరికొంతమంది నిర్వాసితులను తరలించేందుకు, ఇళ్లల్లోని సామగ్రి తీసుకెళ్లేందుకు అధికారులు వాహనాలను ఏర్పాటు చేశారు.
మూసీ సుందరీకరణ పనుల్లో భాగంగా రివర్ బెడ్ పరిధిలో దాదాపు 55 కిలోమీటర్ల పరిధిలో 40 వేల ఆక్రమణలను కార్పొరేషన్ అధికారులు గుర్తించి వాటికి మార్కింగ్ వేసిన సంగతి తెలిసిందే. చాదర్‌అలా మార్కింగ్ చేసిన ఇళ్లలో స్వచ్ఛందంగా ఖాళీ చేసిన వారి నివాసాల కూల్చివేత ఇప్పుడు ప్రారంభమైంది.


