TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శని, ఆదివారాల్లో మూసీ కూల్చివేతలు ? 

Published on: Thu Sep 26, 2024 10:31AM

మూసీ రివర్ బెడ్ లో ఇళ్లను కూల్చివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం   నేపథ్యంలో అధికారులు సర్వే చేస్తున్నారు. మూసీ సుందరీకరణలో భాగంగా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఇళ్లను తొలగించి డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని  ప్రభుత్వం నిర్ణయించింది. కూల్చివేసే ఇళ్లను అధికారులు మార్కింగ్ చేస్తున్నారు. అయితే స్థానికులు మార్కింగ్ ప్రక్రియను అడ్డుకుంటున్నారు.  
శనివారం మధ్యాహ్నం నుంచి ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. మూసీ బాధితుల వివరాలను అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. మూసీ రివర్ బెడ్ లో రెండువేల ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు. 15 వేల డబుల్ బెడ్ రూంలను బాధితులకు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.