వారిని సముద్రం మింగేసింది
Published on: Mon Feb 1, 2016 6:10PM
విహారం కోసం వచ్చిన విద్యార్థులను మృత్యువు కబళించింది. మహారాష్ట్రలో ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 13 మంది విద్యార్థులు సముద్రం పాలయ్యారు. మహారాష్ట్రలో రాయగడ్ సమీపాన మురుద్ బీచ్ లో ఈ విషాదం చోటుచేసుకుంది. తీరానికి కొట్టుకొచ్చిన వారిలో 10 మంది బాలురు, కాగా ముగ్గురు బాలికలు. పుణే అబీద్ ఇనామ్ దార్ డిగ్రి కాలేజ్ లో చదివే 135 మంది విద్యార్థులు పిక్నిక్ కు వెళ్లారు. అంతా సముద్రంలో కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేస్తుండగా, అలల తాకిడికి కొంత మంది స్టూడెంట్స్ సముద్రంలోకి కొట్టుకుపోయారని అధికార వర్గాలు తెలిపాయి.


