చేబ్రోలులో దారుణ హత్యలు!!
Published on: Mon Aug 4, 2014 11:16AM
.jpg)
గుంటూరు జిల్లా చేబ్రోలులో సోమవారం ఉదయం రెండు హత్యలు జరిగాయి. హత్యకు గురైన వారిలో ఒకరు యాచకురాలు పార్వతి కాగా, మరొకరు హైవే పెట్రోలింగ్ వెహికల్ లో కాంట్రాక్ట్ ఉద్యోగి రాజు. ఈ రోజు తెల్లవారుజాము ప్రాంతంలో కొందరు దుండగులు ఆకస్మికంగా ఇనుపరాడ్లతో దాడి చేసి ఆ ఇద్దర్నీ కొట్టి చంపారు. ఈ జంట హత్యలు స్థానికంగా కలకలం రేపాయి. ఈ జంట హత్యలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


