అప్పు ఇవ్వలేదని చంపబోయాడు
Published on: Tue Sep 23, 2014 12:17PM
.jpg)
అప్పు అప్పుడే విరోధం అన్నారు. అంటే అప్పు ఇచ్చినా, ఇవ్వకపోయినా విరోధం మొదలైపోతుందన్నమాట. దీనికి ఉదాహరణగా నిలిచే సంఘటన ఆదిలాబాద్ జిల్లా కాగజ్నగర్లో జరిగింది. స్థానికంగా నివాసం ఉండే మొండెయ్య అనే వ్యక్తి ఇంటికి దత్తు అనే బంధువు వచ్చాడు. తనకు అప్పుగా డబ్బు కావాలని దత్తు మొండెయ్యని అడిగాడు. అయితే మొండెయ్య అప్పు ఇవ్వడానికి నిరాకరించాడు. దాంతో దత్తు ఈరోజుకు మీ ఇంట్లోనే వుండి, మర్నాటి ఉదయం వెళ్ళిపోతానని చెప్పాడు. దానికి మొండెయ్య అంగీకరించాడు. అయితే అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో దత్తు కత్తి, సుత్తి తీసుకుని మొండెయ్య మీద అతని భార్య, కుమారుడి మీద దాడి చేసి వారిని చంపడానికి ప్రయత్నించాడు. అయితే మొండెయ్య కుటుంబం అతని నుంచి తప్పించుకుని కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి దత్తుని పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయితే దత్తు పారిపోయాడు. దత్తు దాడిలో తీవ్రంగా గాయపడిన మొండెయ్య కుటుంబం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.


