నిరాహార దీక్ష కేవలం ఓ ట్రయలర్ మాత్రమే
Published on: Sat Dec 17, 2011 8:18AM
హైదరాబాద్
: మురళీధర రావు దీక్షను భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ విరమింప చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రోజుల పాటు హైదరాబాదులో సాగిన మురళీధర రావు నిరాహార దీక్ష కేవలం ఓ ట్రయలర్ మాత్రమేనని అసలు సినిమా ముందుందని అన్నారు. హైదరాబాద్ నుండి ఢిల్లీ వరకు కాంగ్రెసు అక్రమాలకు పాల్పడుతోందని విమర్శించారు. 2జి కుంభకోణంలో జైలులో ఉన్న రాజాతో పాటు చిదంబరం కూడా తీహార్ జైలులో ఉండాల్సిన వ్యక్తి అని ధ్వజమెత్తారు.
ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న కాంగ్రెసును విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నారు. కులవృత్తులన్నింటిపై బిజెపి అవిశ్రాంతంగా పోరాటం చేస్తుందన్నారు. చేనేత కార్మికుల సమస్యలపై పార్లమెంటులో లేవనెత్తడమే కాకుండా, దేశవ్యాప్తంగా కార్మికులతో ఓ భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. కాగా బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన మురళీధర రావు చేనేత సంక్షోభ నివారణకై ఇందిరాపార్కు వద్ద మూడు రోజులపాటు నిరాహార దీక్ష చేశారు.


