టి పై లేఖను వెనక్కి తీసుకోం: మురళీ మోహన్

 

 

 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకునే ప్రసక్తి లేదు.ఎప్పుడో ఆరేళ్ల క్రితం ఇచ్చిన లేఖ గురించి ఇప్పుడు మాట్లాడటం అనవసరం. మా లేఖ ఇవ్వడం తప్పు అయితే అప్పుడే మాట్లాడాల్సింది. ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు. లేఖ ఇచ్చిన ఆరేళ్ల తరువాత ఇప్పుడు అభ్యంతరాలు తీసుకురావడం అర్ధంలేని వాదన అని తెలుగుదేశం పార్టీ నేత, సినీ నటుడు మురళీ మోహన్ తప్పుపట్టారు.

 

తమకు తెలంగాణ మీద ప్రేమగానీ, సీమాంధ్ర మీద ద్వేషం గానీ లేదని, రెండు ప్రాంతాలకు న్యాయం జరగాలి అన్నదే మా ముఖ్య ఉద్దేశమని, ఉద్యోగాలు, నీళ్లు, హైదరాబాద్ నగరం విషయంలో ఇద్దరికీ సరయిన న్యాయం జరగాలి అన్నదే మా ఆరాటం. మా పార్టీని దెబ్బతీసే కుట్రలో భాగంగా విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు బస్సుయాత్ర జరిగి తీరుతుంది. ఎట్టి పరిస్థితుల్లో యాత్ర విషయంలో వెనక్కి వెళ్లం అని స్పష్టం చేశారు.