TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

టీడీపీ నేత మురళీమోహన్ కార్ల షోరూమ్ కూల్చివేత...గంటా ఆఫీస్ కూడా ?

Published on: Thu Jun 27, 2019 2:30PM

 

ఏపీలో ప్రజావేదిక రచ్చ చల్లారక ముందే ఏపీ ప్రభుత్వం మిగతా అక్రమ కట్టడాల మీద కూడా విరుచుకు పడుతోంది. ఇప్పటికే కరకట్ట మీద ఉన్న అన్ని అక్రమ కట్టడాలకి నోటీసులు జారీ చేసి అవి కూడా త్వరలో పడగోడతాం అంటున్న ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని చోట్లా ఉన్న అక్రమ కట్టడాల మీదా ద్రుష్టి సారించింది.  ఈ నేపథ్యంలో విశాఖపట్నం నగరపాలక అధికారులు అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించారు. నగరంలోని జోన్-2 పరిధిలో ఎంవీపీ సెక్టార్-11లో టీడీపీ నేత మురళీ మోహన్ కి చెందియన్ జయభేరి ట్రూ వ్యాల్యూ కార్ షోరూమ్ కు కూల్చివేశారు. ముందస్తు అనుతి తీసుకోకుండా 1000 గజాల స్థలంలో  ఎలాంటి ప్లాన్ లేకుండా నిర్మించి షోరూమ్ ను నిర్వహిస్తున్నారని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడ పాత కార్ల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. దీనికి ప్లాన్‌ లేదని గుర్తించిన జోన్‌-2 టౌన్‌ప్లానింగ్‌ అధికారులు దానిని తొలగించారు. దీంతో పాటు జోన్‌-1 పరిధిలోని భీమిలిలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు చెందిన క్యాంప్‌ కార్యాలయానికి ఎలాంటి అనుమతి, ప్లాన్‌ లేనట్టు గుర్తించారు. జోన్‌-2 పరిధి ద్వారకానగర్‌లో అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌కు చెందిన భవనం ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మించినట్టు అధికారులు గుర్తించినట్టు సమాచారం. వీటిని కూడా సాధ్యమైనంత తొందరగా కూల్చేయాలని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.