అర్ధం కానీ ఆంగ్లం నా చావుకు కారణం..
Published on: Fri Jul 27, 2018 12:14PM
మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు ఎందుకంటే ఇక్కడ కనపడేవన్నీమనలాంటి ఓ మనిషి చేసిన అద్భుతాలే. మనం సాధించగలం అనే ధైర్యం లేక చాల మంది తమ జీవితాలను అర్దాంతరంగా ముగిస్తున్నారు. తాజాగా ఆంగ్లం అర్ధం కావట్లేదని మురళీకృష్ణ అనే హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు వదిలాడు.
.jpg)
కోదాడలో ఉన్నత విద్య పూర్తి చేసిన మురళి రెండేళ్లు తండ్రికి పొలం పనుల్లో చేదోడువాదోడుగా ఉన్నాడు. కాగా పదిరోజుల క్రితం తన డిగ్రీ మిత్రులతో కలిసి హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో హోటల్‌మెనేజ్‌మెంట్ కోర్సులో చేరాడు. దోమలగూడలో తన మిత్రులతో కలిసి రూంలో ఉంటున్నాడు. ఈ క్రమంలో కళాశాలకు వెళ్లివచ్చాక మురళీకృష్ణ రూంలో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తొటి మిత్రులు విషయాన్ని స్థానిక పోలీసులకు, కుటుంబసభ్యులకు తెలియజేశారు.
మృతుడు ఆంగ్లం అర్ధంకావటంలేదంటూ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్‌లో రాసినట్లు దోమలగూడ పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామనికి గురువారం తరలించారు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మురళికృష్ణ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.ఉన్నత విద్యనభ్యసించి ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాల్సిన ఎంతో మంది నిరాశ నిస్పృహలతో క్షణం కూడా ఆలోచించకుండా తమ ప్రాణాలను విడుస్తున్నారు.


