మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్దం
Published on: Wed Feb 15, 2012 3:50PM
హైదరా
బాద్: పురపాలక సంఘం ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. ఎన్నికలకు అవరోధంగా మారిన బిసి ఓటర్ల గుర్తింపుకోసం రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ విజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 50 రోజుల వ్యవధిలో బిసి ఓటర్ల గుర్తింపు ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు. కులాలవారీగా ఓటర్ల సంఖ్య ఆధారంగానే రాష్ట్రస్థాయిలో పురపాలక సంఘాల వారీగా చైర్ పర్సన్ల రిజర్వేషన్లు ఖరారుచేస్తారు. 2012 జనవరి ఒకటో తేదీ వరకు నమోదైన ఓటర్లు మున్సిపల్ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవచ్చ్చు . పురపాలక సంఘాల వారీగా 33శాతం కౌన్సిలర్ స్థానాలను బిసిలకు కేటాయిస్తారు. అంతేకాకుండా తొలిసారిగా మహిళలకు 50శాతం సీట్లు కేటాయిస్తారు. ఈ నెల 6న ప్రారంభమైన బిసి ఓటర్ల గుర్తింపు ప్రక్రియ మార్చి 26వ తేదీ వరకు కొనసాగుతుంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి చైర్ పర్సన్ల రిజర్వేషన్లు రాష్ట్రస్థాయిలోనూ, కౌన్సిలర్ల రిజర్వేషన్లు జిల్లాస్ద్తాయిలోనూ జరుగుతాయి.


